తెలివైన భార్య ఉంటే ఇదే ప్రమాదం!

28 Apr, 2019 18:28 IST|Sakshi

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్ర గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర మరోసారి తన కామిక్‌ సెన్స్‌ను బహిర్గతం చేశారు. తను చదివిన ఓ ఇంగ్లీష్‌ న్యూస్‌ ఆర్టికల్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేయటమే కాకుండా తను అడిగిన ప్రశ్నకు భార్య ఇచ్చిన సమాధానాన్ని సైతం పంచుకున్నారు.  వివరాల్లోకి వెళితే.. భార్య మాట వినాల్సి వస్తుందని, ఓ వ్యక్తి తను చెవిటి, మూగ వాడిగా నటించి.. 62 సంవత్సరాలు భార్యను ఎలా మోసం చేశాడన్న వార్తను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రం. ఆ వార్త చదవగానే తాను 5నిమిషాల పాటు విరగబడి నవ్వుకున్నానని పేర్కొన్నారు.

ఈ వార్తను భార్యకు చెప్పి ఈ సందర్భంగా.. ఆయన అడిగిన ప్రశ్న.. ఆమె చెప్పిన సమాధానం..
ఆనంద్‌ మహీంద్ర : నేను కూడా ఇలాగ మూగ, చెవిటి వాడిలా నటించి నిన్ను మోసం చేస్తే?
భార్య : నిజమా?.. నువ్వు నీ మొబైల్‌ ఫోన్‌లో ఓ ఐదు నిమిషాల పాటు మాట్లాడకుండా ఉండు చాలు.( అతడి ప్రశ్నకు వెనువెంటనే ఆమె ఇచ్చిన సమాధానం)
దీంతో ఆనంద్‌ మహీంద్ర నోట్లో పచ్చివెలక్కాయ పడ్డటైంది. ‘‘తెలివైన భార్య ఉంటే ఇదే ప్రమాదం’’ అంటూ ఆశ్చర్యపోయారు.

మరిన్ని వార్తలు