త్వరలో వెబినార్‌ కోమా వ్యాధి: ఆనంద్‌ మహీంద్రా

5 Jun, 2020 21:55 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే తమ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. అయితే ఆఫీసు సమావేశాలు, కీలక చర్చలు వెబినార్‌(ఆన్‌లైన్‌)లోనే నిర్వహించడానికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా మాత్రం వెబినార్‌ సమావేశాలను ఇష్టపడనని ఇది వరకే ట్విటర్‌లో పేర్కొన్నారు. వెబినార్‌ పట్ల తన అసహనాన్ని ఓ ఉదాహరణతో చూపించాడు. 

మొఘల్‌ ఏ ఆజం అనే సినిమాలోని ఫోటోను చూపెడుతు.. ఆ ఫోటోలో.. సలీమ్‌ అనార్కలీని నిద్రలేపే సన్నివేశాన్ని సూచిస్తూ.. ‘ఉటో అనార్కలీ వెబినార్‌ కథమ్‌ హువా’(అనార్కలీ వెబినార్‌ అయిపోయింది.. ఇక నిద్రలేవు) అంటూ తన హాస్య చతురతతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాడు. మహీంద్రా తాజా ట్వీట్‌కు 600 రీట్వీట్‌లు, 6250మంది నెటిజన్లు లైక్‌లు చేశారు. ఆనంద్‌ మహీంద్రా హాస్య చతురత అద్భుతమని ఓ నెటిజన్‌ తన అభిమానాన్ని చాటుకున్నాడు. వెబినార్‌లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వెబినార్‌ కోమా అనే కొత్త వ్యాధి రాబోంతుందని ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు.చదవండి: వినూత్న ఆలోచన.. ఆటోలో 5 అరలు!

 

మరిన్ని వార్తలు