'శ్రీనివాస గౌడకు గోల్డ్‌ మెడల్‌ ఇవ్వండి'

15 Feb, 2020 16:27 IST|Sakshi

ముంబై : జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ను మించిన వేగంతో పరిగెత్తిన అందరి దృష్టి ఆకర్షించిన శ్రీనివాసగౌడపై  ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అతడికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కు పంపిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. తాజాగా మహీంద్రా అండ్‌ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా శ్రీనివాస గౌడను ప్రశంసిస్తూ ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు దృష్టికి తీసుకెళ్లారు.' అతడి శరీర దారుడ్యాన్ని ఒక్కసారి చూడడండి. అథ్లెటిక్స్‌లో విజయాలు సాధించే సామర్థ్యం అతనిలో కనిపిస్తుంది. అందుకే అతడికి 100 మీటర్ల స్ప్రింట్‌ విభాగంలో శిక్షణ అందించేలా మంత్రి కిరణ్‌ రిజుజు చూడాలి లేదా కంబళ క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చేలా ప్రయత్నం చేయాలి. దీంతో పాటు శ్రీనివాస్‌ గౌడకు బంగారు పతకాన్ని కూడా అందించాలంటూ' మహీంద్రా ట్వీట్‌ చేశారు.  
(ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!)

కాగా మహీంద్రా ట్వీట్‌కు కిరణ్‌ రిజుజు స్పందించారు. శ్రీనివాస్‌ గౌడను శాయ్‌కు పిలిపిస్తామని కేంద్ర మంత్రి రిజుజు హామీ ఇచ్చారు.' అథ్లెటిక్స్‌కు సంబంధించి ఒలింపిక్స్‌ ప్రమాణాలపై చాలా మందికి అవగాహన ఉండదు. శారీరక దృడత్వం, ఓర్పు చాలా అవసరం. ట్రయల్స్‌ కోసం శ్రీనివాస గౌడను శాయ్‌ కోచ్‌ల  వద్దకు పంపిస్తాం. దేశంలో  ప్రతిభ కనబరిచే వ్యక్తులను ఎప్పటికి వదలబోం' అని రిజుజు ట్విటర్‌లో తెలిపారు. 

>
మరిన్ని వార్తలు