వాళ్లుండేది అక్కడే.. రూ.450 కోట్ల బంగ్లాలో..!

15 Nov, 2018 21:03 IST|Sakshi

ముంబై : ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ వివాహం డిసెంబర్‌ 12న ముంబయ్‌లో జరునున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్‌మెంట్‌ ఇటలీ లేక్‌ కోమోలో ఇటీవలే అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్‌ తారాగణమంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. మరో నెల రోజుల్లో ఒక్కటి కాబోతున్న ఇషా, ఆనంద్‌ల పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అత్యంత రిచ్‌గా రూపొందిన వీరి వెడ్డింగ్‌ కార్డు అందర్నీ ఔరా అనిపించగా.. తాజాగా.. ఈ సంపన్నుల పెళ్లి వేడుకకు సంబంధించి మరో విషయం వైరల్‌ అయింది. (ఇషా అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌కార్డు.. వైరల్‌)

2012లోనే కొనుగోలు
వివాహానంతం ఇషా, ఆనంద్‌ 50 వేల అడుగుల విస్తీర్ణం గల ‘గులితా’ అనే భారీ బంగ్లాలో కాపురం ఉండబోతున్నారని సమాచారం. అరేబియన్‌ సముద్రం ఒడ్డున గల ఈ ‘గులితా’ బిల్డింగ్‌ హిందుస్థాన్‌ యునిలివర్‌ అధీనంలో ఉండగా.. రూ.450 కోట్లు పెట్టి పిరమాల్‌ సంస్థ 2012లో కొనుగోలు చేసింది. ఆనంద్‌కు వెడ్డింగ్‌ గిఫ్ట్‌గా అతని తల్లి దండ్రులు స్వాతి, అజయ్‌ పిరమాల్‌ ఈ ఖరీదైన భవనాన్ని కొనిపెట్టారట. ఇక బ్రిటీష్‌ రాయల్ ఫ్యామిలీ నివాసముండే బకింగ్‌హామ్‌లోని ప్యాలెస్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసం. కాగా, భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ ‘అంటిల్లా’ ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందిన విషయం విదితమే. ‘అంటిల్లా’నిర్మాణ వ్యయం 14 వేల కోట్లు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా