కేసు పెట్టిన ఆనంద్ శర్మ

14 Feb, 2016 11:23 IST|Sakshi
జేఎన్ యూలో రాహుల్ గాంధీతో ఆనంద్ శర్మ

ఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్ యూ)లో తనపై దాడి జరిగిందని కాంగ్రెస్ సీనియర్  నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ కేసు పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని వసంత్ విహార్ పోలీసుస్టేషన్ లో ఆదివారం ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 'దేశద్రోహం' కేసులో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో విపక్షాలు శనివారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో పాటు, ఢిల్లీ పీసీసీ చీఫ్ అజయ్‌మాకెన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.

పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా నిర్ధారితుడైన అఫ్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేయటాన్ని నిరసిస్తూ.. జేఎన్‌యూ ఆవరణలో గత మంగళవారం నాడు నిరసన కార్యక్రమం నిర్వహించటంపై వసంత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 124 ఎ (దేశద్రోహం), 120 బి (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం.. ఈ కేసులో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు, ఏఐఎస్‌ఎఫ్ నేత కన్హయ్యకుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేయటం తెలిసిందే.

మరిన్ని వార్తలు