పార్లమెంటులో ఆనంద్‌శర్మ వర్సెస్‌ అరుణ్‌జైట్లీ

27 Jul, 2017 07:42 IST|Sakshi
పార్లమెంటులో ఆనంద్‌శర్మ వర్సెస్‌ అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంపై విమర్శలు కాంగ్రెస్‌ పార్టీ నేత ఆనంద్‌శర్మ విమర్శలు చేయడంపట్ల పార్లమెంటులో గందరగోళం నెలకొంది. ఆనంద్‌శర్మ వర్సెస్‌ ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అరుణ్‌ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆనంద్‌ శర్మ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల్లో నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ నిర్మాతల్లో జవహార్‌ లాలూ నెహ్రూ ప్రధానమైనవారని, ఆయన పేరును ప్రస్తావించకపోవడంతో ఆయన ప్రసంగం తమను నిరుత్సాహానికి గురిచేసిందని ఆనంద్‌ శర్మ అన్నారు.

'జాతి నిర్మాతలను ప్రతి దేశం ప్రతి సమాజం గౌరవిస్తుంది. అదే సంస్కృతి భారత్‌లోనూ కొనసాగుతోంది. భారత జాతి నిర్మాతల్లో అగ్రగణ్యులు గాంధీ ఆయనను గౌరవించారు. ఆయనతోపాటు జైలుకు వెళ్లొచ్చిన జవహార్‌ లాల్‌ నెహ్రూని మాత్రం వదిలేశారు. నిన్న గాంధీని పండిట్‌ దీన్‌ దయాల్‌ తో పోల్చారు' అని అన్నారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ నేతలంతా అడ్డు చెప్పారు. శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బల్లలు చరుస్తూ గందరగోళం చేశారు. ఆగ్రహంతో ఒక్కసారిగా నిల్చున్న అరుణ్‌ జైట్లీ వెంటనే ఆనంద్‌ శర్మ చేసిన ప్రసంగం మొత్తాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మేమంతా కూడా నిన్ననే జన్మించలేదు.. మాకు ఈ విషయాలు తెలియకుండా ఉండటానికి' అని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు