‘తాజ్‌మహల్‌.. ఒకప్పటి శివాలయం’

27 Jan, 2019 20:14 IST|Sakshi
అనంత్‌ కుమర్‌ హెగ్దే(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ:  ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ నిర్మాణంపై కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్దే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదని, అది ఒకప్పటి శివాలయం అని.. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిగిన ఓ సమావేశంలో  ఆయన మాట్లాడుతూ.. ‘తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదు. జయసింహా అనే రాజు వద్ద నుంచి తాజ్‌మహల్‌ను కొనుగోలు చేసినట్టు తన ఆత్మకథలో షాజహాన్‌ చెప్పారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన శివాలయాన్ని తొలుత తేజోమహల్‌ అని పిలిచేవారు.. కాలక్రమంలో దాని పేరును తాజ్‌మహల్‌గా మార్చారు. మనం ఇలాగే నిద్ర పోతుంటే మన ఇళ్ల పేర్లను మసీదులుగా మారుస్తారు. రామున్ని జహాపన అని.. సీతా దేవిని బీబి అని పిలుస్తార’ని తెలిపారు. అంతేకాకుండా చరిత్రని.. వక్రీకరిస్తూ తిరగరాశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలపై అనంత్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు