అయోధ్య‌లో శివలింగం, స్థంభాలు ల‌భ్యం

21 May, 2020 16:34 IST|Sakshi

లక్నో : అయోధ్యలో పురాత‌న దేవ‌తా విగ్ర‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. రామజ‌న్మ‌భూమిలో స్థ‌లాన్ని చ‌దును చేస్తున్న క్ర‌మంలో విరిగిన దేవ‌తా విగ్ర‌హాల‌తో పాటు ఐదు అడుగుల ఎత్తైన శివ‌లింగం, ఏడు న‌ల్ల‌రాతి స్థంభాలు, ఆరు ఎర్ర రాతి స్థంభాలు, క‌ల‌శంతో పాటు ప‌లు పురాత‌న వ‌స్తువులు ల‌భించాయి. ఈ విష‌యం గురించి శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చంప‌త్ రాజ్ మాట్లాడుతూ.. 'రామ జ‌న్మ‌భూమిలో గ‌త ప‌ది రోజులుగా భూమిని చ‌దును చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ‌ శిథిలాలను తొల‌గిస్తున్నారు. (వీహెచ్‌పీ మోడల్‌లోనే మందిర్‌..)

ఈ త‌వ్వ‌కాల్లో పిల్ల‌ర్ల‌తోపాటు శిల్పాలు వెలుగు చూశాయ‌'న్నారు. దీని గురించి విశ్వహిందూ ప‌రిష‌త్(వీహెచ్‌పీ) స్పందించింది. ఈ మేర‌కు వీహెచ్‌పీ నేత వినోద్ భ‌న్సాల్‌ మాట్లాడుతూ.. మే 11న రామాయ‌లం ప‌నులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి త‌వ్వ‌కాల్లో పూర్ణ కుంభం వంటి ఎన్నో అవ‌శేషాలు ల‌భించాయ‌న్నారు. కాగా యేళ్ల త‌ర‌బ‌డి వివాదాల్లో నానుతున్న‌ అయోధ్య స‌మ‌స్య‌ను సుప్రీంకోర్టు గ‌తేడాది ప‌రిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా రామజన్మభూమి స్థలాన్ని హిందువుల‌కు అప్ప‌గిస్తూ తీర్పు వెల్ల‌డించింది. మరోవైపు మ‌సీదు నిర్మాణం కోసం సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు వేరే ప్ర‌దేశంలో ఐదు ఎక‌రాల‌ను కేటాయించాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. (తాత్కాలిక ఆలయంలోకి రాముని విగ్రహం)

మరిన్ని వార్తలు