బీజేపీ కార్యకర్త పొరపాటు.. ఆడుకుంటున్న నెటిజనులు

18 Jun, 2020 20:38 IST|Sakshi

కోల్‌కతా: భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల పట్ల భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాకు సంబంధించిన ప్రతి దాన్ని బాయ్‌కాట్‌ చేయాలని పిలుపునిస్తున్నారు. డ్రాగన్‌ దేశ అధ్యక్షుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో ఓ పొరపాటు చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త ఒకరు పొరపాటున కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను చైనా అధ్యక్షుడిగా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన అన్‌సోల్‌లో చోటు చేసుకుంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు బీజేపీ మాస్క్‌ ధరించి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. చైనా ప్రధాని కిమ్‌ జాంగ్‌ ఉన్‌గా పేర్కొన్నాడు. దీనిపై నెటిజనులు తెగ కామెంట్‌ చేస్తున్నారు. ‘బీజేపీ ప్రకారం చైనా అధ్యక్షుడు కిమ్‌  జాంగ్‌ ఉన్‌ అన్నమాట.. ఉత్తర కొరియా చైనాను స్వాధీనం చేసుకుందా ఏంటి’ అని కామెంట్‌ చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు