ఈ వీడియో చూస్తే అతని కోపంలో బాధ తెలుస్తుంది

22 Mar, 2018 10:44 IST|Sakshi

ముంబై : పండించిన పంటకు ధరలేదు, చేసిన అప్పు తీర్చే దారిలేదు. కళ్ల ముందు నిండుగా పండిన పంట పొలమంతా కనిపిస్తున్నా సరైన ధర లేకపోవడంతో ఓ రైతు కడుపుమండింది. మనసులో బాధ కోపంగా మారి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నాశనం చేశాడు. పొలమంతా మల్లె పువ్వుల్లాగా పరుచుకున్న క్యాలిఫ్లవర్ పంటను ధ్వంసం చేసుకున్నాడు.

ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. 432 కిలోల క్యాలిఫ్లవర్‌కు కేవలం రూ.400 ధర చెల్లిస్తే ఎలా బతికేదని ప్రశ్నిస్తూ ప్రేమ్‌సింగ్‌ ఈనే రైతు తన పొలంలోని కాలిఫ్లవర్‌ పంటను నాశనం చేశాడు. నలభై వేలు పెట్టుబడి పెట్టి పండించిన కాలిఫ్లవర్‌, టమాట పంటకు కేవలం రూ.4000 వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతు ప్రేమ్‌సింగ్‌. రైతు చేసిన ఆ పనిని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి స్పందించిన శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఆ రైతుకు రూ.లక్ష నష్టపరిహారం అందించారు. రైతులకు తమ పార్టీ మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు