వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించండి

14 Jun, 2018 20:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించాలని ‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ)’’ రాష్ట్రాలను కోరింది. యవ్వనంలో ఉన్న జంతువులు కబేళాలకు బలికాకుండా ఆ కమిటీ చూసుకుంటుదని తెలిపింది. చలనచిత్రాలలో జంతువులు హింసకు గురికాకుండా చూసుకోవటానికి ప్రత్యేకంగా మరో కమిటీ వేస్తామని పేర్కొంది. ఒక వేళ జంతువులను చలనచిత్రాలలో ఉపయోగించినట్లయితే ఏడబ్ల్యూబీఐ నుంచి ‘నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌’ తీసుకోవాలని తెలిపింది. ఇంకో నెలలోగా వీధి జంతువుల సమస్యను పరిష్కరించాలని కోరింది. జంతువులకు వసతిగా ఉండేలా గృహాలను నిర్మించాలని  సూచించింది.

‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’’ ఛైర్‌పర్సన్‌ ఎస్‌పీ గుప్తా మాట్లాడుతూ.. తామెవరినీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలనటం లేదని, మాంసం తినేవారు తినటానికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. కాకపోతే అన్ని జంతు వధశాలలు నియమాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. జంతు వధశాలల్లో యవ్వనంలో ఉన్న జంతువులను చంపకుండా ఉండటానికి దుకాణాలను తనిఖీ చేయటం జరుగుతుందన్నారు. రహదారులపై జంతువులు తిరగటం కూడా క్రూరత్వం కిందకే వస్తుందన్నారు. వీధి జంతువులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవటానికి ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించటమే కాకుండా  ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశామని పేర్కొంది. 

మరిన్ని వార్తలు