చర్చ లేకుండానే మరోరోజు

12 Dec, 2016 14:55 IST|Sakshi
చర్చ లేకుండానే మరోరోజు

క్యూల మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారానికి విపక్షాల డిమాండ్
 
 న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగింది. అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా ఎలాంటి చర్చ జరగకుండానే వరుసగా నాలుగోరోజూ వారుుదాపడ్డాయి. క్యూల మృతుల పరిహారంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. లోక్‌సభలో విపక్షాల వారుుదాతీర్మానాల డిమాండ్‌కు అన్నాడీఎంకే జతచేరింది. నోట్లరద్దు నిర్ణయంలో ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధమేనని మంత్రి అనంత్ కుమార్ చెప్పగా.. చర్చకు తాము సిద్ధమేనని అయితే ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

 రాజ్యసభలో..: ఎగువ సభ ప్రారంభమైనప్పటినుంచీ.. విపక్ష సభ్యులు వెల్‌లోనే నిలబడ్డారు. ప్రధాని సభకు వస్తేగానీ నోట్లరద్దుపై చర్చ ముందుకు సాగనివ్వమన్నారు. పాత కరెన్సీ నోట్లు మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఎంసీల సభ్యులకు.. యూపీ బరిలో బద్ధశత్రువులైన సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు కూడా జతచేరటంతో నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. దీంతో సభ పలుమార్లు వారుుదా పడింది.

 లోక్‌సభలో రచ్చ.. శీతాకాల సమావేశాల మొదటిరోజునుంచీ నోట్లరద్దుపై విపక్షాలు చేస్తున్న ఆందోళనకు మంగళవారం అన్నాడీఎంకే సభ్యులూ జతచేరారు. విపక్ష సభ్యులు వెల్‌చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘అమ్మా మీరు మా మాట కూడా వినాలి’అని ఖర్గే వ్యాఖ్యానించగా.. ‘తల్లి తన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది’అని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఆందోళన కొనసాగుతుండగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించి సభను వారుుదా వేశారు. కాగా, నోట్లరద్దుపై పార్లమెంటు లో అవసరాన్ని బట్టి ప్రధాని మాట్లాడతారని కేంద్ర మంత్రి వెంకయ్య మీడియాతో అన్నారు. నోట్ల రద్దుపై మూకుమ్మడిగా దాడిచేస్తున్న విపక్షాలు.. బుధవారం పార్లమెంటు ఆవరణలో ధర్నా చేయాలని నిర్ణరుుంచాయి.

 మన్మోహన్ పాఠాలు చెప్పుకోవచ్చు  
 పంజాబ్ వర్సిటీలో ఆతిథ్య ఉపాధ్యాయుడిగా చేరటం వల్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయలేమని, ఈ అంశంపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. జూలైలో పంజాబ్ వర్సిటీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌కు ‘జవహార్‌లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్‌షిప్’ అందుకోవాలని కోరింది.

మరిన్ని వార్తలు