రాష్ట్రంలో భారీగా ఏసీబీ దాడులు

12 Jun, 2019 08:37 IST|Sakshi

సాక్షి,  బెంగళూరు :  కర్నాటకలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెగా దాడులకు దిగారు.  ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో  రాష్ట్ర వ్యాప్తంగా పీడబ్యూడీ, ఎడ్యుకేషన్‌, మైన్స్‌ అండ్‌  జ్యుయాలజీ విభాగాలకు చెందిన ముగ్గురు అధికారుల నివాసాల్లో  సోదాలు నిర్వహిస్తున్నారు.  ధార్వాడ్‌, బెళగావి, ధండేలి, జోయిడా చిత్ర దుర్గ తదితర ప్రాంతాలలోని  ఉన్నత అధికారుల ఇళ్లలో భారీగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో వివిధ పత్రాలను, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

ముఖ్యంగా కర్నాటక యూనివర్శిటీ ప్రొఫెసర్‌ మహదేవప్ప, మైన్స్‌ అండ్‌  జ్యుయాలజీ అధికారి ఉదయ్‌ డి చబ్బీ, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారి ఇళ్లలో ఈ దాడులు  నిర్వహిస్తున్నారు.  అక్రమ సంపాదన ఆరోపణలతో ఈ సోదాలు  జరుగుతున్నాయి.  ఈ దాడులకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి వుంది. 

మరిన్ని వార్తలు