వరకట్న నిరోధక చట్టం దుర్వినియోగమవుతోంది

2 Jul, 2014 20:14 IST|Sakshi
వరకట్న నిరోధక చట్టం దుర్వినియోగమవుతోంది

న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మనస్పర్థలు, గొడవల కారణంగా భార్యలు తమ భర్త, వారి కుటుంబ సభ్యులపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని పేర్కొంది.


ఇలాంటి కేసుల్లో నిందితులను కారణం లేకుండా అరెస్ట్ చేయవద్దని, క్షుణ్ణంగా విచారించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వరకట్నం వేధింపుల కేసులో నిందితులను తొలుత అరెస్ట్ చేసి తర్వాత విచారించాలన్ని పద్ధతిని మానుకోవాలని సూచించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు