యాంత్రిక్స్-దేవాస్ చార్జ్షీట్లో మాధవన్ పేరు

11 Aug, 2016 17:53 IST|Sakshi

న్యూఢిల్లీ: యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్తో పాటు పలువురుపై సీబీఐ గురువారం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాధవన్ నాయర్ను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. 2005లో బెంగళూరుకు చెందిన దేవాస్ మల్టీ మీడియాతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన యాంత్రిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కొత్త శాటిలైట్లను తయారుచేసి, వాటి వినియోగానికి ఎస్-బాండ్ స్పెక్ట్రమ్ ను లీజ్ కు ఇచ్చేందుకు దేవాస్ యాంత్రిక్స్ తో 2005లో ఒప్పందం చేసుకుంది.

అయితే రేడియో తరంగాల కోసం ఎస్‌-బాండ్‌ ఫ్రీక్వెన్సీ అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంట్లో మాధవన్‌ నాయర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తలపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఇస్రో మాజీ సైంటిఫిక్‌ సెక్రటరీ భాస్కర్‌నారాయణ, ఆంత్రిక్స్‌ మాజీ మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రీథామూర్తి, ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌ మాజీ డైరక్టర్‌ కెఎన్‌ శంకర్ పై వేటు వేసిన విషయం విదితమే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు