గిఫ్ట్‌ అందుకున్న ‘అను’

21 Aug, 2018 13:38 IST|Sakshi

సాక్షి, చెన్నై: వర్షాలు, వరదలు విపత్తు ఈ పదాలకు అర్థాలు తెలియకపోయినా, తన తోటి  చిన్నారుల కష్టాన్ని చూసి చలించిపోయిన తమిళనాడు అనుప్రియ (9) దానగుణంతో  తన కోరికను నెరవేర్చుకుంది.  అలాగే అనుప్రియకు కొత్త సైకిల్‌ ఇస్తామని ప్రకటించిన హీరో  సైకిల్స్‌  కూడా తన మాటను నిలబెట్టుకుంది. మంగళవారం అనుప్రియను కలిసిన  సంస్థ ఎండీ, ఛైర్మన్‌ పంకజ్‌  ఎం ముంజాల్‌  బ్రాండ్‌ న్యూ సైకిల్‌ను  బహూకరించారు.  ఈ సందర్బంగా అనుప్రియతో మాట్లాడటం, ఆమె తల్లిని కలవడం సంతోషంగా ఉందని, జీవితాంతం అనుప్రియ ఇదే వ్యక్తిత్వాన్ని కలిగి వుండాలంటూ  ఆయన ట్వీట్‌ చేశారు.

కేరళ వరదల్లో తన తోటి చిన్నారుల కష్టాలను టీవీలో చూసి కేవలం బాధపడి ఊరుకోకుండా, తనవంతు సాయం చేసేందుకు పెద్ద మనసు చేసుకుంది. యతద్వారా తమిళనాడు విల్లుపురానికి చెందిన అనుప్రియ(9) వార్తల్లో నిలిచింది. సైకిల్‌ కొనుక్కునేందుకు  ఐదు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వరద బాధితులకు విరాళమిచ్చి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది.  దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌  అయింది. కేరళ వరద విరాళాల  ట్రాన్సాక్షన్స్‌ ద్వారా లక్షలాదిమంది యూజర్లను సాధిస్తూ, కోట్లాది రూపాయల టర్నోవర్‌ను  సొంతం చేసుకుంటున్న  పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్‌ శర్మకంటే  ఈ చిన్నారి చాలా నయం. అనుప్రియకు సాల్యూట్స్‌ అంటూ  నెటిజన్లు చిన్నారిని అభినందించారు.  అటు అనుప్రియ ఔదార్యానికి స్పందించిన హీరో మోటార్‌ సైకిల్స్‌ సంవత్సరానికి ఒక బైక్‌ (కిడ్స్‌)  అందిస్తామని ట్విటర్‌ ద్వారా వెల్లడించింన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు