ఆర్థికశాఖ సహాయ మంత్రిపై ట్విటర్‌లో విమర్శలు

14 May, 2020 11:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌పై ట్విటర్‌లో నెటిజన్లు విమర‍్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ భారత ఆర్థిక వ్యవస్థపై ‍ప్రతికుల ప్రభావం చూపించబోదని మార్చి నెలలో ఆయన ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. ఈ కష్ట కాలంలో దెబ్బతింటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రధాని మోదీ ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరిట రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. (నిర్మలా సీతారామన్‌ ప్రెస్‌మీట్‌ : నేడు వ్యవ‘సాయం’)

ఇక ఈ ప్యాకేజీలో భాగంగా చిన్న సంస్థలు, బ్యాకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు, రియల్టీ మొదలైన కొన్ని రంగాలకు దక్కే ప్రయోజనాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆమె ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం‌ భాషల్లో వివరించారు. కాగా అదే సమయంలో ఈ ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్ హింది భాషలో అనువదించి చెప్పారు. దీంతో కరోనా వైరస్‌ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికుల ప్రభావం ఉండదని గతంలో మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ చేసిన చేసిన ట్విట్‌ను గుర్తు చేస్తూ నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు