మిగతా రూ. 4.75 కోట్లు కట్టండి

31 May, 2016 14:01 IST|Sakshi

న్యూఢిల్లీ: యమునా నదిని కలుషితం చేసిందుకు విధించిన జరిమానా చెల్లించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఫౌండేషన్ ను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. మార్చిలో ఏఓఎల్ నిర్వహించిన ప్రపంచ సాంసృత్కిక ఉత్సవం సందర్భంగా ఎన్జీటీ రూ. 5 కోట్లు జరిమానా విధించింది. అయితే ఏఓఎల్ రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించింది.

మిగతా మొత్తం రూ. 4.75 కోట్లు చెల్లించాలని ఎన్జీటీ మంగళవారం ఆదేశించింది. యమునా నది తీరంలో శ్రీశ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో మార్చి 11 నుంచి  మూడు రోజుల పాటు వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ నిర్వహించింది. ఈ ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు