కృష్ణా జలాల పంపకాలపై ఏకాభిప్రాయం

19 Jun, 2015 20:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరింది. ఢిల్లీలో జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది.  ఇరు రాష్ట్రాల సమ్మతితో మార్గదర్శకాలు ఖరారు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిని కలసి కృష్ణా యాజమాన్య బోర్డు దీన్ని సమర్పించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పరిశీలనకు పంపి ఆ తర్వాత కేంద్రం నోటిఫై చేయనుంది. ఈ సమావేశంలో ఖరారైన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

  •  
  • కృష్ణా నుంచి ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు ఇవ్వాలనే అంశంపై ఏకాభిప్రాయం
  • ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు
  • వరదల సమయంలో వచ్చే అదనపు నీటిని ఇదే నిష్పత్తిలో వాడుకోవాలి.
  • ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు తదుపరి ఉత్తర్వులతో ప్రభావితం కాకుండా ఇప్పటి నిర్ణయాలు అమలు
  • 2015-16 సంవత్సరానికి మాత్రమే ప్రస్తుత మార్గదర్శకాలు
  • ప్రాజెక్టుల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనేలా వ్యవహరించరాదు
  • చెన్నై తెలుగు గంగకు 5, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు ఇవ్వాలి
  • కేటాయింపుల నుంచి మినహాయించి నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి
  • బచావత్ కేటాయింపుల ప్రకారమే రెండు రాష్ట్రాలకు కేటాయింపు
  • ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి
  • తుంగభద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు న్యాయమైన వాటా వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి
  • రోజువారి వ్యవహారాలకు రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్ చీఫ్లు బోర్డు ప్రతినిధితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు

మరిన్ని వార్తలు