ఏప్రిల్‌ ఫూల్స్‌ డే : బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌

1 Apr, 2019 13:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని ట్రోల్‌ చేసేందుకు ట్విటర్‌లో పలువురు పప్పు దివస్‌ను సెలబ్రేట్‌ చేస్తుండగా, ‘మోదీ మత్‌ బనావ్‌’  హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్‌ కాషాయపార్టీని ట్రోల్‌ చేస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏప్రిల్‌ 1న ఆల్‌ ఫూల్స్‌ డేను సెల్రబేట్‌ చేసుకుంటుండగా, గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పరస్పరం తలపడుతూ ఫూల్స్‌ డేను రక్తికట్టిస్తున్నాయి.

కాగా, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, బీజేపీ చేసిన వాగ్ధానాలను గుర్తుచేస్తూ వారిని నమ్మొద్దంటూ మోదీమత్‌బనావ్‌ హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్‌ సోమవారం ట్విటర్‌లో క్యాంపెయిన్‌ చేపట్టింది. ‘బ్లాక్‌ మనీ ఇంకా దేశానికి చేరలేదు..నీరవ్‌ మోదీ దేశానికి చేరలేదు..యువత ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా’రంటూ మోదీ వైఫల్యాలను ఈ క్యాంపెయిన్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ట్రోల్‌ చేస్తోంది. మరోవైపు సోమవారం ఉదయం బీజేపీ మద్దతుదారులు పప్పుదివస్‌ పేరిట కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ను టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేశారు. రాహుల్‌, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 30,000కుపైగా ట్వీట్‌లతో పప్పుదివస్‌ ట్విటర్‌లో టాప్‌ ట్రెండ్‌లో నిలిచింది.

మరిన్ని వార్తలు