తుపాకీతో బెదిరించి...పాత నోట్ల చోరీ

12 Dec, 2016 15:11 IST|Sakshi
తుపాకీతో బెదిరించి...పాత నోట్ల చోరీ

గయా(బిహార్): బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు బ్యాంకులో చొరబడి తుపాకీతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బుతో ఉడాయించారు.  ఈ సంఘటన గయాజిల్లాలోని గ్రామీణ్ బ్యాంక్ ఆఫ్ బిహార్లో శుక్రవారం చోటుచేసుకుంది. తుపాకీతో బ్యాంకు మేనేజర్ను బెదిరించి రూ.21.30 లక్షలు  దోచుకెళ్లారు. చోరీ చేసిన మొత్తంలో కేవలం 1.20 లక్షలు మాత్రమే కొత్త కరెన్సీ ఉందని, మిగతా 20.10 లక్షలు రద్దైన పాత 500, 1000రూపాయల నోట్లు ఉన్నట్టు గయా డీఎస్పీ అలోక్ కుమార్ తెలిపారు.

అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో మేనేజర్తో పాటూ కేవలం ఇద్దరు కస్టమర్లు మాత్రమే బ్యాంకులో ఉన్నట్టు ఆయన చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. సీనియర్ ఎస్పీ గరిమా మల్లిక్, అడిషనల్ ఎస్పీ బలరామ్ కుమార్ చౌదరిలతో పాటూ మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు