చేత్తో విసిరే సరిహద్దు నిఘా పరికరాలు

13 Jul, 2020 10:34 IST|Sakshi

సరికొత్త యూఏవీలు కొనుగోలు చేయనున్న భారత ఆర్మీ

న్యూఢిల్లీ: చేతితో విసిరితే ఎగురుకుంటూ వెళ్లి శత్రు స్థావరాల సమాచారాన్ని తెలియజేసే పది కిలోమీటర్ల రేంజ్ కలిగిన 200 ఆర్​క్యూ–11 రావెన్​ యూఏవీలను కొనుగోలు చేయడానికి భారత ఆర్మీ సిద్ధమైంది. వీటితో పాటు ఇజ్రాయిల్​ టెక్నాలజీతో తయారైన స్పైక్​ ఫైర్ ఫ్లై ఆయుధాలను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. (ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ)

ఫైర్​ ఫ్లై ఆయుధాలను 40 కిలోమీటర్ల రేంజ్​లో ఉన్న శత్రువులపై గురి తప్పకుండా ప్రయోగించొచ్చు. ఒక వేళ అనుకున్న టార్గెట్​ ప్రాంతాన్ని మారిపోతే ఫైర్​ ఫ్లై తిరిగి వెనక్కు వచ్చేస్తుంది. రావెన్​ యూఏవీలు 500 అడుగుల ఎత్తులో 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. శుత్రు సైన్యంపై నిఘా కోసం వీటిని వాడతారు. సరిహద్దుల్లో గల్వాన్​ వ్యాలీ లాంటి ఉదంతాలు జరిగినప్పుడు శత్రువును అంచనా వేయడానికి ఇవి పనికొస్తాయని నిపుణులు భావిస్తున్నారు. (కరోనా వేళ.. కొత్త రకం కరెన్సీ!)

ఈ నెలలోనే భారతీయ వాయుసేనకు ఫ్రాన్స్​ నుంచి ఐదు రఫేల్​ ఫైటర్​ జెట్లు అందనున్నాయి. వీటిలో నాలుగింటిని పైలట్ల శిక్షణ కోసం వాడనుంది. ఈ ఏడాది చివరకు భారత నేవీ అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన ఐఎన్​ఎస్​ అరిఘాత్​ను కమిషన్​ చేయనుంది.

లడఖ్​ ఘటన తర్వాత హిందూ మహాసముద్రంలో చైనా ఆరు యుద్ధ నౌకలను పంపిందని పేరు చెప్పడానికి ఇష్టపడని నేవీ ఆఫీసర్ ఒకరు చెప్పారు. వాటిపై భారత నేవీ నిఘా పెట్టిందన్నారు. దాంతో తొలుత మూడు చైనా నౌకలు తిరిగి వెనక్కు పోయాయని, ఇటీవల మిగతావి కూడా వెళ్లాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు