'చైనా వార్నింగ్ పట్టించుకోం.. బ్రహ్మోస్ దించుతాం'

23 Aug, 2016 18:51 IST|Sakshi
'చైనా వార్నింగ్ పట్టించుకోం.. బ్రహ్మోస్ దించుతాం'

న్యూఢిల్లీ: చైనా హెచ్చరికలను భారత్ పక్కన పెట్టింది. తమ దేశ వ్యవహారంలో తలదూర్చవద్దని చైనాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమ దేశ సరిహద్దు వ్యవహారం తమ ఇష్టమని, తమ భూభాగంలో ఉన్న సమస్యల దృష్ట్యా ఎలాంటి పనైనా చేసుకుంటామని, అది వేరే దేశాలకు సంబంధించినది కానందున ప్రతి అంశాన్ని చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు సమాచారం.

ప్రస్తుతం అరుణా చల్ ప్రదేశ్ వద్ద ఉన్న భారత సరిహద్దు ప్రాంతంలో భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. వీటిని ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, చైనా మాత్రం వీటి విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, తాము చైనా ప్రభావానికి లోనై ఈ పనిచేయడం లేదని, రక్షణ అనేది తమ వ్యక్తిగత ఆందోళన అయినందున తాము ఈ పనిచేస్తున్నామని చైనాకు వెల్లడించినట్లు ఆర్మీ టాప్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు