పాక్‌ దుస్సాహసాన్ని తిప్పికొట్టిన భారత సైన్యం

18 Sep, 2019 10:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్‌ దుస్సాహసాన్ని తిప్పికొట్టిన వీడియోను భారత సైన్యం బుధవారం విడుదల చేసింది. అండర్‌ బారెల్‌ గ్రనేడ్‌ లాంఛర్లతో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన చొరబాటుదారులు, పాక్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ కమాండోలు, ఉగ్రవాదులను భారత సైన్యం గ్రనేడ్లు విసురుతూ నిరోధించిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. వీడియో ఆధారంగా ఈ ఘటన ఈనెల 12, 13 తేదీల్లో జరిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈనెల 10న పీఓకేలోని హజీపూర్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికుడు సిపాయి గులాం రసూల్‌ను భారత దళాలు మట్టుబెట్టాయి. ఇక ఇదే ప్రాంతంలో సెప్టెంబర్‌ 12 అర్ధరాత్రి దాటిన తర్వాత భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత్‌ దళాలు తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాక్‌ ఉగ్రవాది ఒకరు భద్రతా దళాల చేతిలో మరణించాడు. కాగా భారత దళాలు ఇటీవల గురెజ్‌, హజీపూర్‌ సెక్టార్‌లో రెండు చొరబాటు యత్నాలను దీటుగా తిప్పికొట్టారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు