'జవాన్లూ.. సోషల్ మీడియాతో జాగ్రత్త'

4 Jan, 2016 13:57 IST|Sakshi
'జవాన్లూ.. సోషల్ మీడియాతో జాగ్రత్త'

చండీగఢ్: ఆర్మీ జవాన్లు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని.. ఫేస్బుక్, ఇతర వెబ్సైట్లలో పోర్న్ వీడియోలు, చిత్రాలు చూడొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల రంజిత్ సింగ్ అనే వ్యక్తిని ఐఎస్ఐ ఏజెంట్గా అనుమానిస్తున్న ఓ యువతి హనీట్రాప్ చేసి.. భద్రతా సమాచారాన్ని రాబట్టిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆన్లైన్లో జవాన్లు చేయకూడని పది పనులను పేర్కొంటూ ఆర్మీ అధికారులు ఓ జాబితాను విడుదల చేశారు. దీనిలో.. ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోర్న్ చిత్రాలు చూడరాదు. యూనిఫామ్ ధరించిన ఫొటోను వాట్సప్, ఫేస్బుక్ వంటి వాటిల్లో ప్రొఫైల్ ఫొటోగా పెట్టరాదు. లాటరీలు, ప్రైజులు తగిలాయంటూ వచ్చిన మెసేజ్లను ఓపెన్ చేయరాదు. వ్యక్తిగత సమాచారం, హోదా లాంటి విషయాలను సోషల్ మీడియాలో ఉంచొద్దు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులను అనుమతించొద్దు. జవాన్ల కుటుంబ సభ్యులు సైతం వృత్తిని తెలిపే వివరాలను పోస్ట్ చేయరాదు. వ్యక్తిగత ల్యాప్టాప్లు, కంప్యూటర్లలో మిలటరీకి సంబంధించిన సమాచారం ఉంచొద్దు. ఇలాంటి సూచనలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు