కాచుకూర్చున్న 300 మంది ఉగ్రవాదులు

11 Jul, 2020 20:01 IST|Sakshi

శ్రీనగర్​: భార‌త్‌లోకి చొర‌బ‌డి విధ్వంసం సృష్టించేందుకు సుమారు 300 మంది ఉగ్ర‌వాదులు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఏర్పాటు చేసుకున్న లాంచ్​ప్యాడ్స్​లో సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ శనివారం వెల్లడించింది. ముఖ్యంగా నౌగర్​ సెక్టార్ ప్రాంతంలో ఉన్న లాంచ్ ప్యాడ్లు ఉగ్రవాదులతో కిక్కిరిసిపోయాయని, వారు ఏ క్షణంలోనైనా ఇండియాలోకి చొరబడే అవకాశం ఉందని మేజ‌ర్ జ‌న‌ర‌ల్ వీరేంద్ర వాత్స్ వెల్లడించారు. 250 నుంచి 300 మంది టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. (కరోనా : చైనాపై మరో బాంబు)

ఈ రోజు తెల్లవారుజామున కుప్వారాలో ఎల్వోసీ దాటి భారత్​లోకి చొరబడిన ఇద్దరు టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రూ.1.50 ల‌క్ష‌ల విలువ చేసే ఇండియా, పాకిస్తాన్ క‌రెన్సీని స్వాధీనం చేసుకుంది.(మారణహోమానికి పాక్​ కుట్ర)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా