పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్ల దాడి

15 Jan, 2015 03:19 IST|Sakshi

నాసిక్: మహారాష్ట్రలోని ఉపానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్లు బుధవారం విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్టేషన్ ఆవరణలో తమ వాహనాన్ని పార్కింగ్ చేసుకోవడానికి మంగళవారం రాత్రి పోలీసులు అనుమతించకపోడంతో దాదాపు 150 మంది జవాన్లు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడున్న మహిళా పోలీసుపై అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన పోలీసులందరినీ చితకబాదారు. ఈ ఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఆరుగురు జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు