జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

10 Jul, 2013 09:39 IST|Sakshi
జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

భువనేశ్వర్ : ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్దమైంది. బలరాముడు, సుభద్రా సమేతుడై జగన్నాథుడు రథంపై కోట్లాది మంది భక్తుల దర్శనమివ్వనున్నాడు. రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఉదయం ప్రారంభమయ్య యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బలభద్ర, సుభద్ర సమేతంగా స్వామివారు ఊరేగేందుకు కొత్త రథాలు సిద్దమయ్యాయి. రథయాత్రకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరీతో పాటు దేశంలోని చాలాచోట్ల జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తున్నారు.

జగాలనేలే జగన్నాథుడికి ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర భక్తజనులకు కన్నుల పండుగ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరి శ్రీ జగన్నాధ స్వామివారి ఆలయంలో ఈ వేడుక అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ రథయాత్రను చూడడానికి లక్షలాదిగా జనం దేశవిదేశాల నుంచి తరలివస్తారు. ఈ రథయాత్ర ఉత్సవాలు ఆషాఢ శుక్ల ద్వితీయ అంటే ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షం రెండోరోజున ప్రారంభవౌతాయ. ఇవే శ్రీ జగన్నాథ ఘేఘ యాత్రలుగా పేర్గాంచాయ. కాగా బుద్ధగయా పేలుళ్ల నేపథ్యంలో రథయాత్రకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

మరిన్ని వార్తలు