ఆర్టికల్‌ 31బి రద్దు చేయాలి

20 Jun, 2018 01:32 IST|Sakshi

సుప్రీంకోర్టులో రైతుల పిటిషన్‌

ముంబై: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31బిని రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మహారాష్ట్రలో కిసాన్‌ పుత్ర ఆందో ళన్‌ (కేపీఏ) పేరిట రైతులతో భారీ ఉద్యమాన్ని ప్రారంభించిన అమర్‌ హబీబ్‌ అనే రైతు నాయకుడు మార్చి 21న సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను వేశారు. ఆర్టికల్‌ 31బి తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని చెబుతోంది. అంటే వీటిని కోర్టులో ఎవరూ సవాల్‌ చేయకూడదు. షేత్కా రీ సంఘటన నాయకుడు శరద్‌ జోషి సహచ రుడైన హబీబ్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేపీఏ వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాన్ని గుర్తించిందన్నారు.

దేశంలో వ్యవసాయ సంక్షోభానికి కారణమైన పలు చట్టాలకు మూల కారణం ఆర్టికల్‌ 31బి అని, దీన్ని రద్దు చేస్తే రైతులకు మేలు జరుగుతుంద న్నారు. మెరుగైన మద్దతు ధర లభించడంతో పాటు మిగతా ప్రయోజనాలూ లభిస్తాయ న్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌కు చెందిన వ్యవసాయ భూ గరిష్ట పరిమితి చట్టం, నిత్యావసర వినియోగ వస్తువుల చట్టం, భూసేకరణ చట్టం కిందకు వచ్చే పలు చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని.. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బందులకు గురవుతు న్నారని అన్నారు.

‘ఆర్టికల్‌ 31బి రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగంలో ఉన్న సమాన త్వ హక్కుకు ఇది విరుద్ధం. అంటే ఈ ఆర్టికల్‌ ప్రకారం రైతులు క్రూర స్వభావం ఉన్న చట్టాల ను సవాల్‌ చేయడానికి వీల్లేదు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆర్టికల్‌ను రద్దు చేయడం ద్వారా తొమ్మిదో షెడ్యూల్‌లో కొన్ని చట్టాలనూ రద్దు చేస్తే ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ వంటి వి చేయనవసరం ఉండదు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు