ఇదీ రాష్ట్రపతి ఉత్తర్వు! 

6 Aug, 2019 02:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ –370ను రద్దు చేస్తూ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీనిని రాజ్యాంగ (జమ్మూకశ్మీర్‌కు వర్తింపు) ఉత్తర్వులు, 2019గా పిలుస్తారు. ఈ ఉత్తర్వులు ఇలా ఉన్నాయి. ‘ఆర్టికల్‌ 370లోని నిబంధన (1) ద్వారా దఖలు పడిన అధికారాలతో రాష్ట్రపతి జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ సమ్మతితో ఈ కింది ఉత్తర్వులు జారీచేశారు.  

1. (1) దీనిని రాజ్యాంగ (జమ్మూకశ్మీర్‌కు వర్తింపు) ఉత్తర్వులు–2019గా పిలుస్తారు. (2). ఇది అమల్లోకి రాగానే రాజ్యాంగ (జమ్మూకశ్మీర్‌కు వర్తింపు) ఉత్తర్వులు–1959 రద్దవుతాయి.  
2. రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు, సమయానుసారం సవరించినవి సహా, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి వర్తిస్తాయి. అలాగే మినహాయింపులు, మార్పులు ఈ కింది రూపంలో వర్తిస్తాయి. ఆర్టికల్‌ –367కు నాలుగో నిబంధన జత చేయడమైంది. ‘‘(4) ఈ రాజ్యాంగ ఉద్దేశాలు జమ్మూకశ్మీర్‌లో అమలయ్యేందుకు (ఎ) ఈ రాజ్యాంగ రెఫరెన్సెస్‌ లేదా నిబంధనలు ఈ రాష్ట్రానికి అన్వయించవచ్చు. (బి) జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు ఆ రాష్ట్ర శాసనసభ సిఫారసుతో రాష్ట్రపతి గుర్తించే వ్యక్తికి చేసే రెఫరెన్సెస్‌ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌కు చేసే రెఫరెన్సెస్‌గా అన్వయించాలి. (సి) జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెఫెరెన్సెస్‌ను.. రాష్ట్ర మంత్రివర్గ సలహామేరకు చర్యలు తీసుకునే గవర్నర్‌కు చేసే రెఫరెన్సెస్‌గా అన్వయించాలి. (డి) 370 ఆర్టికల్‌లోని నిబంధన (3)లో ‘రాష్ట్ర రాజ్యాంగ శాసనసభ’ను ‘రాష్ట్ర లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’గా చదవాలి..’’ (చదవండి: జన గణ మన కశ్మీరం)

మరిన్ని వార్తలు