కేజ్రీవాల్‌ విచారణను ఎదుర్కోవాలి

26 Mar, 2017 01:37 IST|Sakshi
కేజ్రీవాల్‌ విచారణను ఎదుర్కోవాలి

ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారణను ఎదుర్కోనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఆప్‌ నేతలు అశుతోష్‌ కుమార్, విశ్వాస్, సంజయ్‌ సింగ్, రాఘవ్‌ చద్దా, దీపక్‌ బాజ్‌పాయ్‌లు కూడా విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసును శనివారం చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సుమిత్‌ దాస్‌ విచారించారు.

విచారణకు జైట్లీ హాజరుకాకపోవడంపై కోర్టులో పలువురు న్యాయవ్యాదులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో తమకు ముప్పు ఉందని నిందితులు పేర్కొనడంతో... కేసుకు సంబంధించినవారు మినహా మిగిలిన వారందరినీ బయటకు పంపేయాలని భద్రతా సిబ్బందిని జడ్జి ఆదేశించారు. అనంతరం, తాము ఏ తప్పు చేయలేదని, విచారణకు సిద్ధమని నిందితులు పేర్కొన్నారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 500 కింద కేజ్రీవాల్, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేస్తూ జడ్జి తదుపరి విచారణను మే 20కి వాయిదా వేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో అరుణ్‌జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని కేజ్రీవాల్‌ గతంలో ఆరోపించారు.

మరిన్ని వార్తలు