అరుణ్‌ జైట్లీకి తీవ్ర అనారోగ్యం? సెలవుపై అమెరికాకు

16 Jan, 2019 15:25 IST|Sakshi

మరోసారి అనారోగ్యం పాలైన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ

రెండు వారాల వ్యక్తిగత సెలవుపై  హుటాహుటిన అమెరికాకు

న్యూయార్క్‌లో త్వరలో అపరేషన్‌?

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు కీలకమైన ఆర్థిక బడ్జెట్‌ 2019 (తాత్కాలిక బడ్జెట్‌ను) కేంద్ర ఆర్థికమంత్రిశాఖ అరుణ్‌ జైట్లీ (66)చేతుల మీదుగా లోక్‌సభ్‌లో ప్రవేశపెడతారా లేదా అనేది ఇపుడు సందేహాస్పదంగా మారింది. ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారన్న వార్త  ఈ ప్రశ్న లేవనెత్తుతోంది. మూత‍్ర పిండ మార్పడి ఆపరేషన్‌ చేయించుకుని  కోలుకుంటున్న ఆయన మళ్లీ అనారోగ‍్యం పాలయ్యారు. తొడలో సాఫ్ట్‌ టిష్యూ కాన్సర్‌ (శరీరంలోని ఇతర భాగాలకు చాలా వేగంగా విస్తరించే) తో బాధపడుతున్నారని ది వైర్‌ రిపోర్ట్‌ చేసింది.  

తాజా నివేదికల ప్రకారం రెండు వారాల వ్యక్తిగత సెలవుపై ఆయన చికిత్సకోసం న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లారు. అమెరికాలో జైట్లీకి శస్త్రచికిత్స నిర‍్వహించనున్నారు. ఆపరేషన్‌తోపాటు కీమోథెరపీ చికిత్సల అనంతరం ఇంత స్వల్పకాలంలో రాజధానికి తిరిగి వచ్చే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేవలం పరీక్షల నిమిత్తమే లండన్‌ వెళ్లారా, ఆసలు కేంద్ర విత్తమంత్రి ఆరోగ్య పరిస్థితి ఏంటి?  బడ్జెట్‌ను ఎవరు  ప్రవేశపెడతారు అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రతినిధి నిరాకరించారు. 

గత ఏడాది అరుణ్‌ జైట్లీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి పియూష్ గోయల్ ఆర్థిక మంత్రిత్వశాఖ  తాత్కాలిక బాధ్యతలను స్వీకరించిన  సంగతి తెలిసిందే. మరోవైపు ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టను​న్న తాత్కాలిక బడ్జెట్‌పై అవగాహన కల్పించేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ సిద్దమైంది. ట్విటర్‌ ద్వారా ‘నో యువర్‌ బడ్జెట్‌ 2019’ పేరుతో వివిధ అంశాలపై పోస్ట్‌లను ట్వీట్‌ చేస్తోంది. రెవెన్యూ, క్యాపిటల్‌ బడ్జెట్, ఔట్‌ కంబడ్జెట్‌ తదితర అంశాలను సంక్షిప్తంగా వివరిస్తోంది.
 

tag/Budget2019?src=hash&ref_src=twsrc%5Etfw">#Budget2019 pic.twitter.com/nolw5zojQ0

— Ministry of Finance (@FinMinIndia) January 16, 2019

మరిన్ని వార్తలు