ఆర్టికల్‌ 370 రద్దు: ప్రశంసించిన జైట్లీ, రామ్‌ మాధవ్‌

5 Aug, 2019 14:02 IST|Sakshi

న్యూఢిల్లీ: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రశంసించారు. చారిత్రక తప్పిదాన్ని నేడు సవరించారన్నారు. జమ్మూకశ్మీర్‌ విభజనపై అరుణ్‌ జైట్లీ స్పందిస్తూ.. చారిత్రక తప్పిదాన్ని సవరించిన ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్‌ షాను అభినందిస్తున్నాను అన్నారు. ఇక మీదట మహోన్నత భారత్‌ దిశగా పయనించబోతున్నాం అంటూ జైట్లీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది అద్భుతమైన రోజు. జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలన్న శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వంటి ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలించాయి. సమగ్ర భారతదేశం కోసం ఏడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇక తెరపడింది. జీవితంలో అసలు ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించామా’ అని రామ్‌ మాధవ్‌ ట్వీట్‌ చేశారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు, 35ఏ రద్దు, జమ్మూకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజిస్తూ అమిత్‌ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌ను చట్టసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్‌ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు