ఆస్పత్రి నుంచి జైట్లీ డిశ్చార్జి

4 Jun, 2018 15:58 IST|Sakshi
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : కిడ్నీ మార్పిడి కోసం మూడు వారాల పాటు ఎయిమ్స్‌లో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎయిమ్స్‌లో తన పట్ల ఆప్యాయత కనబరిచిన వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ జైట్లీ ట్వీట్‌ చేశారు. మే 12న ఆస్పత్రిలో చేరిన జైట్లీ (65)కి మే 12న శస్త్రచికిత్స జరిగింది. అప్పటినుంచి ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్‌​సోకకుండా ఆయనకు ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించారు.

మోదీ సర్కార్‌ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆస్పత్రి నుంచే ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉందని,  గత మూడువారాలుగా తనకు అంకితభావంతో సేవలందించిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడిక్స్‌ అందరికీ కృతజ్ఞతలంటూ జైట్లీ ట్వీట్‌ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, సహచరులు, స్నేహితులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. జైట్లీ ఆస్పత్రిలో ఉండగా రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు