పార్టీ నుంచి అరుణాచల్‌ సీఎం తొలగింపు

30 Dec, 2016 02:39 IST|Sakshi

ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పీపుల్స్‌ పార్టీ (పీపీఏ) అధినాయకత్వం ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మీన్, మరో ఐదుగురు శాసనసభ్యుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణం కింద వారు గురువారం రాత్రి సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తనకు ఉన్న విచక్షణాధికారంతో ఈ సస్పెన్షన్ విధిస్తున్నట్లు పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు కాఫా బెంగియా చెప్పారు. ఈ సస్పెన్షన్ తో పీపీఏ లెజిస్లేచర్‌ పార్టీకి నాయకుడిగా ఉండే అర్హతను సీఎం కోల్పోయారు.

మరిన్ని వార్తలు