పరీక్షలో పెమా పాసయ్యాడు

20 Jul, 2016 14:28 IST|Sakshi

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం బతికింది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిని పెమా ఖండూ విశ్వాస పరీక్ష నెగ్గారు. బుధవారం నిర్వహించిన ఈ పరీక్షలో ఆయనకు అనుకూలంగా 46 మంది ఓట్లు వేశారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 45 స్థానాలు ఉండగా 11 స్థానాలు బీజేపీకి మిగతావి ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు ఉన్నాయి.

అంతకుముందు రాష్ట్రపతి పాలన ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలతో అది రద్దయిన విషయం తెలిసిందే. ఆ వెంటనే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న నబం టుకీ కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే టుకీని వ్యతిరేకించినవారిలో ఒకరైన పెమా ఖండూ గత ఆదివారం రాజధాని ఈటానగర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ సమయంలో జరగాల్సిన విశ్వాస పరీక్ష బుధవారం జరిగింది. ఈ పరీక్షలో పెమా ఖండూ నెగ్గారు.

>
మరిన్ని వార్తలు