ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

1 Aug, 2019 12:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో దేశ రాజధానివాసులకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ నజరానా ప్రకటించారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారికి ఉచిత విద్యుత్‌ వర్తింపచేస్తామని కేజ్రీవాల్‌ గురువారం ప్రకటించారు. 201 యూనిట్ల నుంచి 400 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగానికి విద్యుత్‌ బిల్లులపై 50 శాతం రిబేట్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

200 యూనిట్లలోపు వినియోగానికి ఎలాంటి బిల్లు రాదని, పూర్తిగా ఉచితమని కేజ్రీవాల్‌ వెల్లడిస్తూ ఇది సామాన్యులకు మేలు చేసే చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. నగర విద్యుత్‌ వినియోగదారుల్లో 33 శాతం మంది ఉచిత విద్యుత్‌తో లబ్ధి పొందుతారని అన్నారు. కాగా ఢిల్లీలో మహిళలందరికీ ఉచిత మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం కేజ్రీవాల్‌ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా