పంజాబ్‌లో అన్ని స్ధానాల్లో పోటీ..

20 Jan, 2019 15:33 IST|Sakshi

చండీగఢ్‌ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్ధానాల్లో పోటీ చేస్తామని ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. బర్నాలాలో ఆదివారం ఆప్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన కేజ్రీవాల్‌ సంగ్రూర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వంతో విసుగెత్తిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కేజ్రీవాల్‌ జోస్యం చెప్పారు.

పంజాబ్‌ పార్టీ నేతలు ఎంపీ, భగవంత్‌ మాన్‌, విపక్ష నేత హర్పాల్‌ చీమా, ఎమ్మెల్యే అమన్‌ అరోరా కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. కాగా ఆప్‌ ఇప్పటికే సంగ్రూర్‌, ఫరీద్‌కోట్‌, హోషియార్పూర్‌, అమృత్‌సర్‌, ఆనంద్‌పూర్‌సాహిబ్‌ స్ధానాల్లో పోటీచేసే అభ్యర్ధులను ప్రకటించింది. మరోవైపు పార్టీ నాయకత్వంతో విభేదించిన ఇద్దరు పంజాబ్‌ ఆప్‌ ఎంపీలు ధర్మవీర గాంధీ, హరీందర్‌ ఖల్సాకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. వీరి సస్పెన్షన్‌ ఎత్తివేతపైనా కేజ్రీవాల్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

మరిన్ని వార్తలు