ఆ కుటుంబాలకు రూ. 10 లక్షలు: కేజ్రీవాల్‌

27 Feb, 2020 17:40 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో మరణించిన వారి కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిహారం ప్రకటించారు. అల్లర్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా... ఘర్షణల్లో ​కాలిపోయిన ఇళ్ల యజమానులకు రూ. 4 లక్షలు.. వాటిలో అద్దెకు ఉండే వాళ్లకు రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా... పెంపుడు జంతువులను కోల్పోయిన వారికి రూ. 5 వేలు.. అల్లర్లలో రిక్షాలు ధ్వంసమైతే యజమానులకు రూ. 25 వేలు, ఇ- రిక్షాల యజమానులకు రూ. 50 వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అల్లర్లలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఖర్చులు సైతం కూడా ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా బాధిత కుటుంబాలకు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం చెల్లించనున్న నష్ట పరిహారం:

  • మృతుల కుటుంబాలకు(పెద్దలు): రూ. 10 లక్షలు
  • మృతులు మైనర్లు అయితే: రూ. 5 లక్షలు
  • శాశ్వత వైకల్యం కలిగితే: రూ. 5 లక్షలు
  • తీవ్రంగా గాయపడిన వారికి: రూ, 2 లక్షలు
  • స్వల్పంగా గాయపడిన వారికి: రూ. 20 వేలు
  • అనాథలుగా మిగిలిన వారికి: రూ. 3 లక్షలు
  • పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి: రూ. 5 వేలు(ఒక్కో దానికి)
  • రిక్షా ధ్వంసమైతే: రూ. 25 వేలు
  • ఇ- రిక్షా ధ్వంసమైతే: రూ. 50 వేలు
  • ఇల్లు పూర్తిగా కాలిపోతే: రూ. 5 లక్షలు(యజమానికి రూ. 4 లక్షలు, అద్దెకు ఉంటున్న వారికి రూ. లక్ష)
  • ఇల్లు పాక్షికంగా కాలిపోతే: రూ. 2.5 లక్షలు
  • షాపు ధ్వంసమైతే: రూ. 5 లక్షలు
  • పూర్తిగా ఇల్లు ధ్వంసమైన వారికి: తక్షణ సాయంగా రూ. 25 వేలు
మరిన్ని వార్తలు