హోలీ త్రోబ్యాక్‌ ఫోటోపై స్పందించిన కేజ్రీవాల్‌

22 Mar, 2019 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సంబంధించిన త్రోబ్యాక్‌ ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. విశేషం ఏంటంటే ఈ ఫోటోలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎక్కడ ఉన్నాడో గుర్తుపట్టలేకపోయారు నెటజన్లు. చివరకూ కేజ్రీవాలే ఫోటోలో తను ఎక్కడ ఉందో చెప్పారు. వివరాలు.. కేజ్రీవాల్‌ ఐఐటీలో చదువుతున్న రోజుల్లో హోలీ సందర్భంగా తీసిన ఫోటోనొకదాన్ని ఆయన స్నేహితుడు రాజీవ్‌ సరఫ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 1986 నాటి కాలం నాటి ఈ ఫోటోలో కేజ్రీవాల్‌ను గుర్తుపట్టలేకపోయారు నెటిజన్లు. చివరకు ఓ రిపోర్టర్‌ ‘ఫోటో చాలా బాగుంది. కానీ ఇందులో మీరెక్కడ క్రేజీవాల్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. అందుకు కేజ్రీవాల్‌​ రిప్లై ఇస్తూ.. బ్రౌన్‌కలర్‌ ప్యాంట్‌ వేసుకుని ముందు నడుస్తున్నది నేనే అంటూ రీట్వీట్‌ చేశారు.

1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కేజ్రీవాల్ బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1993లో ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఢిల్లీకి ఏడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 2015 నుంచి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు న్యూఢిల్లీలో ఇన్‌కమ్ టాక్స్ జాయింట్ కమిషనర్‌గా పని చేసేవారు.

మరిన్ని వార్తలు