5 ల‌క్ష‌ల స‌ల‌హాల్లో ఎక్కు‌వ వాటి‌కే: కేజ్రీవాల్‌

14 May, 2020 14:38 IST|Sakshi

న్యూఢిల్లీ :  కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్ర‌జ‌ల నుంచి త‌మ‌కు అందిన సూచ‌న‌ల‌లో అధిక శాతం బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరిన‌ట్లు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. భార‌త్‌ కరోనా వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం కొన్ని సేవ‌ల‌‌పై స‌డ‌లింపులు ఇచ్చి ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌ను అదుపు చేయ‌డంతోపాటు, ఏయే స‌ర్వీసుల‌ను పునఃప్రారం‌భించాల‌నే దానిపై ముఖ్య‌మంత్రి ఢిల్లీ ప్ర‌జ‌ల నుంచి సూచ‌న‌లు కోరారు. ఈ క్ర‌మంలో ల‌క్ష‌ల్లో ప్ర‌జ‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించారు. అనంత‌రం దీనిపై అర‌వింద్ కేజ్రీవాల్ గురువారం మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వానికి మొత్తం అయిదు ల‌క్షల సూచ‌న‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఇక హస్తినాలో ఇప్ప‌టి వ‌ర‌కు 7998 మంది కరోనా బారిన ప‌డ‌గా, 106 మంది (మృత్యువాత) ప‌డ్డారు. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 472 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తరువాత అత్యధికంగా కరోనా కేసులు ఢిల్లీలోనే ఉన్నాయి.  (మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించండి )

కేంద్రం తీసుకున్న‌ లాక్‌డౌన్ స‌డ‌లింపు నిర్ణ‌యం నేప‌థ్యంలో దేశ రాజ‌ధానిలో సోమ‌వారం నుంచి కొన్ని నూత‌న కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తించ‌నున్నట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడీలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న అన్నారు. సెలూన్లు, స్పాలు, సినిమా హాల్స్ వంటి వ్యాపారాలు తెరుచుకుంటే క‌రోనా మ‌ళ్లీ విబృంభించే ప్రమాదం ఉంద‌ని అన్నారు. ఎన్ని మార్గ‌ద‌ర్శ‌కా‌లు, నిబంధ‌న‌లు పాటించినా ఇలాంటి ప్ర‌దేశాలు ఇప్ప‌ట్లో తెరుచుకోక‌పోవ‌డ‌మే మేల‌న్నారు. మార్కెట్ అసోసియేష‌న్ నుంచి త‌మ‌కు చాలా సూచనలు వచ్చాయని, ప్రతిరోజూ బేసి- స‌రి నిబంధనను ఉపయోగించి మార్కెట్లను తెరవవచ్చని వారు చెప్పార‌ని ముఖ్య‌మంత్రి  పేర్కొన్నారు. (లాక్‌డౌన్‌: కేజ్రీవాల్‌ వినూత్న నిర్ణయం )

''చాలా మంది ప‌బ్లిక్ స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించాల‌ని కోరారు. ప్ర‌స్తుతం చాలా కార్యాల‌యాలు తెరుచుకున్నాయి. కాని ప్ర‌తి ఒక్క‌రిని సొంత వాహ‌నం లేదు. వారికి ప్ర‌జా ర‌వాణా అవ‌స‌రం. వారు తమ కార్యాలయానికి ఎలా వెళుతున్నారు. కొందరు ఢిల్లీలో మెట్రో రైలు త‌ప్ప‌క‌ నడపాల‌ని సూచించారు''. అని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈ రోజు సాయంత్రం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌తో సమావేశం కానున్న‌ట్లు, వీటిపై చ‌ర్చించిన అనంత‌రం కేంద్రానికి పంపాల్సిన సల‌హాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు అందిస్తామ‌ని కేజ్రీవాల్ తెలిపారు.  కాగా సూచ‌న‌లు, స‌ల‌హాల‌తోపాటు మాస్కులు ధ‌రించ‌ని వారిపై, భౌతిక దూరం నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనేక మంది సూచించిన‌ట్లు సీఎం తెలిపారు. (టిక్‌టాక్‌కు అమెరికాలో మరోదెబ్బ..! )

‘తెల్లగా, సూట్‌కేస్‌‌ సైజ్‌లో ఉంది’ 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు