మూడురెట్లు పెరిగిన టెస్టింగ్‌ సామర్థ్యం

22 Jun, 2020 15:03 IST|Sakshi

విస్తృతంగా టెస్టుల నిర్వహణ

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్‌ పరీక్షల సామర్థ్యం మూడు రెట్లకు పైగా పెంచామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. గతంలో రోజుకు 5000 టెస్ట్‌లు నిర్వహించగా ప్రస్తుతం రోజుకు 18,000 కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలో కరోనా వైరస్‌ తాజా పరిస్థితిని సీఎం వివరిస్తూ ఇప్పుడు ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం లేదని స్పష్టం చేశారు. హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా వైరస్‌ రోగులు ఇప్పుడు తమ ఆక్సిజన్‌ స్థాయిలు పరీక్షించుకునేందుకు వారందరికీ పల్స్‌ ఆక్సీమీటర్లను అందచేస్తున్నామని చెప్పారు.

చైనాతో భారత్‌ రెండు యుద్ధాలు చేస్తోందని, కరోనా వైరస్‌తో పాటు సరిహద్దుల్లో చైనాతో పోరాడుతోందని జూన్‌ 15 నాటి ఘర్షణల నేపథ్యంలో కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఇక దేశ రాజధానిలో కరోనా కేసులు 60,000కు చేరువగా 59,746 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 33,000 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి కాగా 25,000 క్రియాశీల కేసులున్నాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, రక్తంలో ఆక్సిజన్‌ స్ధాయిలు పడిపోవడవం కరోనా రోగుల్లో ముఖ్య లక్షణాలుగా కనిపిస్తున్నాయని చెప్పారు.

చదవండి : వివాదాస్పద ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన ఢిల్లీ గవర్నర్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు