వస్తువులం కాదు.. మనుషులమే

20 Apr, 2019 11:13 IST|Sakshi

న్యూఢిల్లీ : తీహార్‌ జైలులో ఓ ముస్లిం ఖైదీ వీపు మీద బలవంతంగా ఓం గుర్తును ముద్రించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధినేత, అసదుద్దీన్‌ ఓవైసీ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘మమ్మల్ని అవమానించడానికి రోజుకోక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. ఇది చాలా అసాధరణమేకాక ఎంతో అవమానకరం కూడా. మేము మనుషులమే.. వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్‌ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు.. తప్ప ఇందుకు వేరే ఇతర బలమైన కారణాలు ఏం లేవు కదా’ అని ట్వీట్‌ చేశారు.

ఇంతకు విషయం ఏంటంటే షబ్బీర్‌ అలియాస్‌ నబ్బీర్‌ అనే వ్యక్తి తీహార్‌ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం నబ్బీర్‌.. తమ బ్యారక్‌లోని ఇండక్షన్‌ స్టవ్‌ సరిగా పని చేయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు ‘ఫిర్యాదులు చేస్తున్నావ్‌.. నాయకుడిగా ఎదగాలని చూస్తున్నావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అంతటితో ఊరుకోక మెటల్‌ ఓం సింబల్‌ని తీసుకొచ్చి.. కాల్చి దాన్ని నబ్బీర్‌ వీపు మీద ముద్రించారు. ఓ రెండు రోజుల పాటు అతనికి భోజనం కూడా పెట్టలేదు.

ఈ విషయం గురించి తోటి ఖైదీలకు ‘నబ్బీర్‌ హిందువుగా మారాడు. ప్రస్తుతం నవరాత్రి దీక్ష చేస్తున్నాడు. దానిలో భాగంగా ఉపవాసం ఉన్నాడని’ తెలిపారు. ఈ క్రమంలో జైలులో తనకు జరిగిన అవమానం గురించి నబ్బీర్‌ తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ క్రమంలో ఈ నెల 17న నబ్బీర్‌ కేసు ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో నబ్బీర్‌ తల్లి జైలులో తన కొడుకుకు ప్రాణాపాయం ఉందని బెయిల్‌ మంజూరు చేయమని కోర్టును కోరింది. దాంతో న్యాయమూర్తి విషయం ఏంటని ప్రశ్నించగా ఈ వ్యవహారం వెలుగు చూసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

నేడే విశ్వాస పరీక్ష: కూటమి సంఖ్య వందకు తక్కువే!

నీళ్ల కోసం ఇంత దారుణమా!

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

58 పురాతన చట్టాల రద్దు

22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్‌ : ఎమ్మెల్యేపై వేటు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్‌ షా

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

మూక హత్యలపై కేంద్రం రియాక్షన్‌ ఇదే..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!

కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్‌ ఆసక్తికర ట్వీట్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై ఆరా తీయండి

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..