ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌పాలి : మోదీకి సీఎం లేఖ‌

30 Apr, 2020 09:22 IST|Sakshi

జైపూర్ : వ‌ల‌స కార్మికుల‌ను ఆయా రాష్ర్టాల‌కు త‌ర‌లించ‌డానికి ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌పాల్సిందిగా రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్ల‌ట్ కేంద్రాన్ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి లేఖ రాశారు. వివిధ రాష్ర్టాల్లో వ‌ల‌స‌కార్మికులు పెద్ద సంఖ్య‌లో చిక్కుకున్నార‌ని, వారిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చాలంటే దేశ వ్యాప్తంగా ఒకే విధ‌మైన ప్ర‌ణాళిక  అమ‌లుచేయాల‌ని సూచించారు. ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుక్కున్న కార్మికులు, వ‌ల‌స కూలీలు, ప‌ర్యాట‌కులు, విద్యార్థులను వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు ఆయా రాష్ర్టాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కేంద్రం సూచించిన సంగ‌తి తెలిసిందే. రాష్ర్టాలు స‌మ‌న్వ‌యం చేసుకొని వారిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చాల్సిందిగా సూచించింది.  (వారికి సాయం చేశారు మరి మన వారికి....)

అయితే కొన్ని లక్ష‌ల‌మంది వ‌ల‌స కార్మికులు చిక్కుకుపోయిన నేప‌థ్యంలో రైళ్లు వంటి ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పించిన‌ప్పుడే వారంద‌రినీ స‌జావుగా త‌ర‌లించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని అశోక్ గెహ్ల‌ట్ అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ర్ట, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లాంటి ప‌లు రాష్ర్టాల నుంచి రాజ‌స్తాన్‌లో 6 లక్ష‌ల‌మంది కార్మికులు చిక్కుకున్నార‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంద‌ని వివ‌రించారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇత‌ర రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన రాజ‌స్తాన్ వాసుల‌ను సంయ‌మ‌నం పాటించాల్సిందిగా కోరారు. అంద‌రినీ వారి గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు ప్ర‌ణాలిక‌లు రూపొందించామ‌ని, ఇప్ప‌టికే ఆయా రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు