ప్రకృతికి మేలు చేసే బ్యాంబూ బాటిల్స్‌..!

10 Aug, 2019 14:40 IST|Sakshi

ప్రస్తుతం పర్యావరణాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌ ఒకటి. పచ్చటి ప్రకృతికి చీడలా తయారైన ఈ రక్కసి కారణంగా ఎన్నో ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ నిషేధానికై చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం రోజూవారీ జీవితంలో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం భాగమైపోయింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని అరికట్టేందుకు ఓ ఐఐటీ పూర్వ విద్యార్థి తన వంతు ప్రయత్నంగా పర్యావరణ హితమైన వాటర్‌ బాటిల్‌ను తయారు చేశాడు.

అసోం ఐఐటీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ధ్రితిమాన్‌ బోరా వెదురు బొంగులతో రూపొందించిన ఈ బాటిల్‌ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కారకుండా ఉండటమే కాకుండా... నీళ్లని ఎల్లప్పుడూ చల్లగా ఉంచే ఈ చెక్క బాటిల్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారవేత్తగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న బోరా.. ఒక్కో బాటిల్‌ ధరను రూ. 450- 700గా నిర్ణయించాడు. సాధారణ బాటిళ్లలాగే వీటిని కూడా రెండు వారాలకొకసారి శుభ్రం చేయాలని సూచించాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు