అస్సాం వరదలు: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సాయం

23 Jul, 2019 21:22 IST|Sakshi

డిస్‌పూర్‌: అస్సాంలో గత కొన్ని రోజులుగా వరదలతో లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అస్సాంతో సహా, దిగువనున్న బిహార్‌ను కూడా వరదలు ముంచెతున్న విషయం తెలిసిందే. ఎగువన ఉన్న బ్రహ్మపుత్ర నదిలో వరదలు భారీగా వస్తుండడంతో రెండు రాష్ట్రాల ప్రజలు వదల్లో చిక్కుకున్నారు. అయితే అస్సాం వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ అస్సాంకు రెండుకోట్ల విరాళాలను ప్రకటించారు. తాజాగా మరియాని నియోజకవర్గానకి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి వరద బాధితులకు ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

వరదలో చిక్కుకున్న పలు గ్రామల ప్రజలకు బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అందించారు. మంగళవారం రూప్‌జ్యోతి మజూలిలో ఈ కార్య‍క్రమాన్ని చేట్టారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు సాయం చేయడం తన కనీస బాధ్యతని పేర్కొన్నారు. దీంతో పాటు వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని.. వందలాది గ్రామాలు వరదలో​ నీట మునిగాయన్నారు. వరదల వల్ల 60 మందికిపైగా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది నిరాశ్రయులై రోడ్ల మీద ఉన్నారని చెప్పారు. అలాంటి వారికి ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని’ విమర్శించారు. గత సంవత్సరం ఓ వ్యక్తి మరణిస్తే కనీసం దహన సంస్కారాలు చేయడాని కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో రూప్‌ జ్యోతినే సాయం చేసిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా