ఎన్‌ఆర్‌సీ జాబితా: క్రాష్‌ అయిన వెబ్‌సైట్‌

31 Aug, 2019 12:45 IST|Sakshi

గువాహటి : అసోం ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల నేపథ్యంలో ఎన్‌ఆర్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ క్రాష్‌ అయింది. భారత పౌరులను గుర్తించే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ) గురువారం ఉదయం 10 గంటలకు తుది జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితా విడుదల అయిన పది నిమిషాలకే  వెబ్‌సైట్‌  స్తంభించిపోయింది. మీసేవా కేంద్రాలలో ప్రస్తుతం సైట్‌ను చేరుకోలేం అంటూ చూపిస్తోంది. దీంతో అనేకమంది తుది జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోడానికి క్యూ లైనల్లో నిల్చోని ఉండిపోయారు.

కాగా తుది ఎన్‌​ఆర్‌సీ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించగా, 19 లక్షల మందికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. జాబితాలో చోటు లేని వారిని చట్టపరమైన ఎంపికలు జరిగే వరకు విదేశీయులుగా ప్రకటించలేమని కేంద్రం తెలిపింది. అంతేగాక జాబితాలో పేరు లేని వారు విదేశీయుల ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీ సేవ కేంద్రాలలో తమ పేర్లను చూసుకోవాలని అధికారులు వెల్లడించారు.

చదవండి: ఎన్‌ఆర్‌సీ అసోం తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్‌!

మరిన్ని వార్తలు