అసోం: నదిలో చెలరేగిన మంటలు

3 Feb, 2020 16:52 IST|Sakshi

గువహతి: అసోంలో ఓ నదికి భారీగా మంటలు అంటుకున్నాయి. దిబ్రూగఢ్‌ జిల్లాలోని బుర్హిదింగ్‌ నది కింది భాగం నుంచి వెళ్తున్న ఆయిల్‌ పైప్‌ పేలడంతో మంటలు ప్రారంభమయ్యాయి. నది అంతర్భాగంలోని పైప్‌లైన్‌ పేలిపోవడంతో ఉపరితలంపై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దిబ్రూగఢ్‌ జిల్లా సహర్కాటియా సమీపంలోని ససోని గ్రామం వద్ద పైప్‌లైన్‌ నుంచి ఆయిల్‌ బయటకు వచ్చి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.



ఆయిల్ ఇండియాలిమిటెడ్‌కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైనుకు నదీ తీరంలో లీకవటంతో ఆయిల్ నదిలోకి  వచ్చింది. ఇది గమనించిన కొందరు నదీ  తీరంలో నిప్పు అంటించి ఉంటారని భావిస్తున్నారు. గత 3 రోజులుగా క్రూడాయిల్ నదిలోకి ప్రవహించి మంటలు వ్యాప్తి చెందుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని నహర్కటియాలోని సాసోని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో నదిలో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించి ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

>
మరిన్ని వార్తలు