ఆస్తులపై విచారణ జరపండి : సుప్రీంకోర్టు

11 Sep, 2017 12:37 IST|Sakshi
ఆస్తులపై విచారణ జరపండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : గణనీయంగా ఆస్తులు పెంచుకున్న 7 మంది పార్లమెంట్‌​, 98 వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలపై దర్యాప్త జరపాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ (సీబీడీటీ)ని సుప్రీంకోర్టుసోమవారం ఆదేశించింది.  దర్యాప్తు జరపాల్సిన 7మంది పార్లమెంట్‌, 98 మంది ఎమ్మెల్యేల జాబితా మంగళవారం సీల్డ్‌ కవర్‌లో సీబీడీటీకి అందుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఎంపీలు, ఎమ్మెల్యేలు గణనీయంగా ఆస్తులు పెంచుకున్నట్లు తేలిందని సుప్రీంకోర్టు సెంటల్ర​ బోర్డ్‌ఆఫ్‌ డైరెక్ట​ ట్యాక్స్‌కు తెలిపింది. సీల్డ్‌ కవర్‌లో జాబితా అందిన తరువాత ప్రజాప్రతినిధుల ఆస్తులపై దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీబీడీటీ సుప్రీంకోర్టుకు తెలిపింది.

లక్నోలోని ప్రముఖ ఎన్‌జీఓ సంస్థ ‘లోక్‌ ప్రహరి’   ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సుప్రీంను  ఆశ్రయిం‍చిం‍ది. అందులో ప్రజాప్రతినిధులు ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన అంశాలను సుప్రీంకు నివేదిస్తూ.. ఈ ఆస్తులపై విచారణ జరపాలని కోరింది. లోక్‌ప్రహరీ సంస్థ సుప్రీంకు 26మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 257 మంది శాససనసభ్యుల ఆస్తుల వివరాలను సుప్రీంకు అందించింది. 

మరిన్ని వార్తలు