స్ఫూర్తి నింపుతున్న కరోనా రోగుల డాన్స్‌!

20 Jul, 2020 13:25 IST|Sakshi

బెంగుళూరు: కరోనా వైరస్ మహమ్మారి బారిన చిక్కుకున్న వారిలో ఉత్సాహాన్ని నింపడానికి  కరోనా లక్షణాలు లేని రోగులు కొంతమంది వినూత్న ప్రయత్నం చేశారు. జూలై 19న కర్ణాటకలోని బళ్లారిలోని ఒక కోవిడ్ -19 సంరక్షణ కేంద్రంలో వారు ఒక ఫ్లాష్ మాబ్‌ను నిర్వహించారు. కొంత మంది బృందం ఫేస్ మాస్క్‌లు ధరించి, బళ్లారిలోని కేర్ సెంటర్‌లో వరుసలో నిలబడి, 1999లో విడుదలైన హీరో ఉపేంద్ర చిత్రంలోని కన్నడ పాట మస్తు మస్తు హుడుగి పాటకు చాలా ఉత్సాహంగా డాన్స్‌ చేశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. వారి స్ఫూర్తిని చూసి పలువురు నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం ‍కర్ణాటకలో 63 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక భారత్‌ మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది.
చదవండి: కరోనా బాధితురాలిని ఇంటికి రానివ్వని అత్త

మరిన్ని వార్తలు